Andhra Pradesh: ఏపీలో కొత్తగా 349 మందికి కరోనా

AP Corona Report
షార్ట్స్‌లో చూడండి
ఏపీలో గడచిన 24 గంటల్లో 35,054 కరోనా పరీక్షలు నిర్వహించగా 349 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 67 పాజిటివ్ కేసులు నమోదు కాగా, తూర్పు గోదావరి జిల్లాలో 48, పశ్చిమ గోదావరిలో 45, గుంటూరు జిల్లాలో 43 కేసులు వెల్లడయ్యాయి. కర్నూలు జిల్లాలో అత్యల్పంగా రెండు పాజిటివ్ కేసులను గుర్తించారు. అదే సమయంలో 535 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు 20,66,065 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,47,047 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,649 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 14,369కి పెరిగింది.
Go Back to Shorts
Andhra Pradesh
Corona Virus
Media Report
Daily Update

More Telugu News