CM Jagan: కన్నడ హీరో పునీత్ రాజ్ కుమార్ మృతికి సీఎం జగన్ సంతాపం

CM Jagan conveys condolences to Puneeth Rajkumar demise
షార్ట్స్‌లో చూడండి
ప్రముఖ కన్నడ హీరో పునీత్ రాజ్ కుమార్ ఆకస్మిక మరణంపై ఏపీ సీఎం జగన్ స్పందించారు. పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో మరణించడం తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని తెలిపారు. ఈ సందర్భంగా సంతాపం తెలియజేశారు. పునీత్ కుటుంబసభ్యులకు, బంధుమిత్రులకు, ఆయన అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

పునీత్ మృతిపై టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు రాజమౌళి స్పందించారు. ఎంతో ప్రతిభావంతుడైన యువ నటుడు ఇంత త్వరగా ఈ లోకాన్ని వీడిపోయాడని, అతడి మరణవార్తతో తాను దిగ్భ్రాంతి చెందానని వెల్లడించారు. పునీత్ ను రెండు సార్లు కలిశానని, అతడి ఆతిథ్యం తనను ముగ్ధుడ్ని చేసిందని వివరించారు. ఎంతో వినయవిధేయతలు ఉన్న వ్యక్తి అని, చాలా నిరాడంబరంగా ఉంటాడని రాజమౌళి వివరించారు. ఈ కష్ట సమయం నుంచి తేరుకునే శక్తిని అతడి కుటుంబానికి కలిగించాలని ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు.
Go Back to Shorts
CM Jagan
Condolences
Puneeth Rajkumar
Demise
Karnataka

More Telugu News