‘ఆర్ఆర్ఆర్’ నుంచి రానున్న అదిరిపోయే అప్డేట్!

28-10-2021 Thu 13:40
  • రేపటిదాకా వేచి చూడాలన్న చిత్ర యూనిట్
  • ఎవరి ఊహకందని కొలాబరేషన్ అంటూ టీజ్
  • వచ్చే ఏడాది జనవరి 7న సినిమా విడుదల
RRR Team Teases With Suspense says Wait For Never Heard Never Seen Collaboration In The world
ఆర్ఆర్ఆర్.. సినిమా ప్రకటించింది మొదలు దానిపై ఎన్నెన్నో అంచనాలూ మొదలయ్యాయి. నందమూరి వారింటి వారసుడు, మెగా వారసుడు జట్టు కడుతుండడం.. సినీ జక్కన్న వారిని ఏకం చేయడం.. అందరినీ ఆకర్షించింది. ఇప్పటికే సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఈ దసరాకే సినిమాను విడుదల చేయాలని తొలుత భావించినా కొన్ని అనివార్య కారణాలతో సినిమా విడుదలను వచ్చే ఏడాది జనవరి 7కు వాయిదా వేశారు.

అయితే, ఇప్పుడో తాజా అప్ డేట్ ను చిత్ర బృందం ఇచ్చింది. ఎవరూ కనీవినీ ఎరుగని రీతిలో రేపు ఓ అప్ డేట్ ను ఇవ్వబోతున్నారట. ‘‘ప్రపంచంలోని ఏ సినిమాకూ ఎవరూ కనీవినీ ఎరుగని కొలాబరేషన్ ను మీకు పరిచయం చేస్తున్నాం. దానికదే సాటి. దానిని చూసేందుకు అక్టోబర్ 29 (రేపు) వరకు వేచి చూడండి’’ అంటూ ఆర్ఆర్ఆర్ టీం ప్రకటించింది. ఈ ప్రకటనతో ఆ కనీవినీ ఎరుగని అప్ డేట్ ఏంటోనని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 10 భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నద్ధమవుతున్న సంగతి తెలిసిందే.