ఆదిలాబాద్ జిల్లాలో మద్యం డిపోలో అగ్నిప్రమాదం.. తగలబడుతున్న కోట్లాది రూపాయల మద్యం
- ఉట్నూర్ క్రాస్ రోడ్డులోని డిపోలో అగ్నిప్రమాదం
- షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం సంభవించి ఉండొచ్చన్న అధికారులు
- ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్న అధికారులు
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ... షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం సంభవించి ఉండొచ్చని తెలిపారు. ప్రమాదం వల్ల కోట్లాది రూపాయల నష్టం సంభవించి ఉండొచ్చని అన్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.