మీ పతనం బద్వేలు ఎన్నికలతోనే ప్రారంభమవుతుంది: సోము వీర్రాజు

26-10-2021 Tue 14:45
  • శ్రీకాంత్ రెడ్డి అక్రమంగా ఇసుక తోలుకుంటున్నారు
  • ఏమాత్రం అభివృద్ధి చేయని మీకు ఓట్లు అడిగే హక్కుందా?
  • మీరు అభివృద్ధి చేసినట్టు భావిస్తే మా అభ్యర్థితో చర్చకు రండి
YSRCP downfall starts from Badvel says Somu Veerraju
పగలు, రాత్రి అనే తేడా లేకుండా అక్రమంగా ఇసుక తోలుకునే రాయచోటి వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి బీజేపీపై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. ఉపఎన్నికల కోసం కేంద్ర బలగాలు రావడంతో ఓర్చుకోలేకపోతున్న మీరు నోటికొచ్చినట్టు విమర్శిస్తే ఓట్లు రాలవని అన్నారు. అభివృద్ధిని చూసే ప్రజలు ఓట్లు వేస్తారని చెప్పారు. బద్వేలులో ఉన్న నీరు, రోడ్లు, ప్రభుత్వ డిగ్రీ కాలేజీ తదితర అనేక సమస్యలను తాము పరిష్కరిస్తామని చెప్పారు.

మీరు కబ్జా జేసి అక్రమంగా ఆక్రమించుకున్న భూములను తిరిగి హక్కుదారులకు అందిస్తామని తెలిపారు. కొంత కూడా అభివృద్ధి చేయని మీకు అసలు ఓట్లు అడిగే హక్కుందా? అని ప్రశ్నించారు. మీరు అభివృద్ధి చేసినట్టు భావిస్తే తమ అభ్యర్థితో చర్చకు రావాలని సవాల్ విసిరారు. వైసీపీ పతనం బద్వేలుతోనే ప్రారంభమవుతుందని... ఇది సత్యమని అన్నారు.