Taiwan: పోర్న్ సైట్ లో లెక్కల పాఠాలు.. కోట్లు సంపాదిస్తున్న ఉపాధ్యాయుడు

Taiwan Teacher Teaches Calculus Classes On Adult Sites
  • కాల్క్యులస్ బోధిస్తున్న తైవాన్ టీచర్
  • ఏటా రూ.2 కోట్ల సంపాదన
  • అతడి వీడియోలకు లక్షలాది వీక్షణలు
  • తనను గుర్తించేందుకేనంటూ కామెంట్
పోర్న్ అనగానే ప్రతి ఒక్కరి మెదళ్లలో గుర్తొచ్చేది బూతు, అసహ్యం, అశ్లీలం. లెక్కల పాఠాలూ అందులో వస్తే.. అదో వింత అంటారు కదా! తైవాన్ కు చెందిన చాంగ్షూ అనే ఓ ఉపాధ్యాయుడు పోర్న్ హబ్ అనే ఓ అశ్లీల వెబ్ సైట్ లో లెక్కల పాఠాలు చెబుతున్నాడు. చెప్పడమే కాదు.. తద్వారా కోట్లు సంపాదిస్తున్నాడు. అతడి వీడియోలకు లక్షలాది వీక్షణలూ వస్తున్నాయి. దీంతో అతడు ఏటా రూ.2 కోట్లు జేబులో వేసుకుంటున్నాడు.

X వీడియోస్ వంటి ఇతర పోర్న్ సైట్లలో కూడా ఈయన లెక్కల పాఠాలు చెప్పాలని ప్రయత్నించినప్పటికీ, అక్కడ వర్కౌట్ కాలేదట. ఎందుకంటే, ఆ సైట్లలో నాన్-అడల్ట్ క్లిప్స్ ను అనుమతించరు. దాంతో పోర్న్ హబ్ లాంటి అశ్లీల సైట్లలో తన లెక్కల పాఠాలను అప్ లోడ్ చేస్తే చాలా మంది చూస్తారన్న కొత్త ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని చాంగ్షూ అంటున్నాడు. అందులోనూ పోర్న్ హబ్ లో కంటెంట్ పై నిబంధనలేవీ లేవట.

ఇక తన వీడియోలంటే ఎవరికీ నచ్చకపోయినా.. ‘అడల్ట్ సైట్’ టీచర్ పాఠాలంటే ఎంతో మంది ఆసక్తిగా చూస్తారని చెప్పుకొచ్చాడు. కొత్తదనం కావాలనుకునే చాలా మంది అడల్ట్ సైట్ లో తన వీడియోలు చూస్తారంటున్నాడు.

అడల్ట్ సైట్ లో లెక్కల పాఠాలు చెప్పాలన్నది తన ఉద్దేశం కాదని, కానీ, 'కాల్క్యులస్ బాగా చెప్పే తైవాన్ టీచర్ ఇతను' అని ప్రపంచం తనను గుర్తించేందుకే ఇలా చేస్తున్నానని చాంగ్షూ చెబుతున్నాడు. మరోపక్క, ఇన్ స్టాగ్రామ్, యూట్యూబ్ చానెళ్లలోనూ చాంగ్షూ ఇలా లెక్కల పాఠాలు చెబుతున్నాడు.
Taiwan
Changshu
Maths
Porn Site
Teacher

More Telugu News