త్వరలోనే చిన్నారులకు కొవిడ్ టీకాలు.. కోమార్బిడిటీస్‌తో బాధపడుతున్న వారికి ఉచితం: అపోలో చైర్మన్
- 2-18 ఏళ్ల మధ్య వారికి రెండు డోసులు కొవాగ్జిన్ టీకా
- 12-18 ఏళ్ల లోపు వారికి సూది రహిత జైకోవ్-డి వ్యాక్సిన్
- ఒకటి రెండు మోతాలు, మరోటి మూడు మోతాదులు
- ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే ప్రారంభిస్తామన్న అపోలో గ్రూప్ చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి.రెడ్డి
2 నుంచి 18 ఏళ్ల లోపు వారికి కొవాగ్జిన్ టీకా ఇప్పటికే సిద్ధమైందని, ఈ టీకాను రెండు డోసుల్లో 28 రోజుల వ్యవధిలో ఇవ్వాల్సి ఉంటుందన్నారు. అలాగే, 12 నుంచి 18 ఏళ్ల వయసు వారికి జైకోవ్-డి టీకా సిద్ధమైందని, దీనిని 28 రోజుల వ్యవధిలో మూడు డోసులుగా ఇవ్వాల్సి ఉంటుందని ప్రతాప్ సి.రెడ్డి తెలిపారు. ఇది సూది రహిత వ్యాక్సిన్ అని పేర్కొన్నారు. త్వరలోనే టీకా కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని తెలిపారు.