భారత మొఘల్ రాజుల వజ్రవైఢూర్యాల కళ్లద్దాలివి.. లండన్ లో వేలం!
- ఈ నెల 27న వేలం వేయనున్న సొతెబి సంస్థ
- ఒక్కో దాంట్లో 200 క్యారెట్ల వజ్రాలు, 300 క్యారెట్ల పచ్చలు
- ఒక్కో దానికి రూ.25.8 కోట్లు వస్తాయని అంచనా

దాదాపు 50 ఏళ్ల పాటు ఆ అద్దాలు ఓ ప్రైవేట్ వ్యక్తి వద్దే ఉన్నాయని సంస్థ అంటోంది. 200 క్యారెట్ల వజ్రాలు, 300 క్యారెట్ల ఎమరాల్డ్స్ తో ఈ అద్దాలను తయారు చేశారని చెప్పింది. అయితే అవి ఏ యువరాజు చేయించారో.. వాటి రూపశిల్పి ఎవరన్నది మాత్రం తెలియదని సంస్థ పేర్కొంది. కాగా, వేలానికి ముందు ప్రజల సందర్శనార్థం తొలిసారి ఈ నెల 7 నుంచి 11 వరకు హాంకాంగ్ లో ప్రదర్శించింది. నిన్నటి నుంచి లండన్ లో ప్రదర్శిస్తోంది. అక్టోబర్ 26 వరకు ఆ ప్రదర్శన జరగనుంది. మర్నాడే వేలం నిర్వహించనుంది. ఒక్కో దానికి సుమారు రూ.15.5 కోట్ల నుంచి రూ.25.8 కోట్ల దాకా వస్తుందని అంచనా వేస్తోంది.