సమంత పిటిషిన్ ను అర్జెంటుగా విచారించాలన్న న్యాయవాది... కోర్టు ముందు అందరూ సమానమేనన్న జడ్జి

21-10-2021 Thu 22:06
  • యూట్యూబ్ చానళ్లపై సమంత పరువునష్టం దావా
  • కూకట్ పల్లి కోర్టును ఆశ్రయించిన వైనం
  • తన క్లయింటు సెలబ్రిటీ అన్న సమంత న్యాయవాది
  • కోర్టు చివర్లోనే విచారిస్తామన్న జడ్జి
Samantha files defamation suit
నాగచైతన్యతో తన వైవాహిక బంధం విచ్ఛిన్నమైన నేపథ్యంలో రెండు యూట్యూబ్ చానళ్లతో పాటు డాక్టర్ సీఎల్ వెంకట్రావుపై నటి సమంత హైదరాబాదులోని కూకట్ పల్లి కోర్టును ఆశ్రయించడం తెలిసిందే. ఆమె పరువునష్టం దావా వేశారు. అయితే, సమంత పిటిషన్ వెంటనే విచారించాలని ఆమె తరఫు న్యాయవాది కోరారు. తన క్లయింటు ఓ సెలబ్రిటీ అని, సెలబ్రిటీలను అవమానించేవారిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

అయితే, అందుకు జడ్జి అభ్యంతరం వ్యక్తం చేశారు. సెలబ్రిటీలు అయినంత మాత్రాన ఇప్పటికిప్పుడు విచారణ జరపలేమని, కోర్టు ముందు అందరూ సమానమేనని స్పష్టం చేశారు. సమంత పిటిషన్ ను చివర్లో విచారిస్తామని తేల్చి చెప్పారు. కోర్టుకు సామాన్యులు, సెలబ్రిటీలు అనే తేడాలు ఉండవని అన్నారు.