Telangana: తెలంగాణలో కొత్తగా 183 కరోనా కేసులు

- గత 24 గంటల్లో 41,363 కరోనా పరీక్షలు
- జీహెచ్ఎంసీ పరిధిలో 59 కొత్త కేసులు
- రాష్ట్రంలో ఒకరి మృతి
- ఇంకా 3,967 మందికి చికిత్స
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 41,363 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 183 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 59 కొత్త కేసులు నమోదు కాగా, కరీంనగర్ జిల్లాలో 18, రంగారెడ్డి జిల్లాలో 15, వరంగల్ అర్బన్ జిల్లాలో 13, ఖమ్మం జిల్లాలో 12 కేసులు గుర్తించారు. నారాయణపేట, ములుగు, మహబూబ్ నగర్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు.
అదే సమయంలో 183 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,69,739 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,61,829 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,967 మందికి చికిత్స జరుగుతోంది. కరోనా మృతుల సంఖ్య 3,943కి పెరిగింది.

