Botsa: బూతులు తిడితే ఎవ‌రైనా ఊరుకుంటారా?: మంత్రి బొత్స

botsa slams tdp
షార్ట్స్‌లో చూడండి
టీడీపీ నేత‌ల‌పై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయ‌ణ మండిప‌డ్డారు. చంద్రబాబు నాయుడు ఒక ఉగ్రవాదిలా ప్రవర్తిస్తున్నారంటూ ఆయ‌న తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. టీడీపీ ఓ ఉగ్ర‌వాద‌ పార్టీలా మారిందని, ఒక రాష్ట్ర సీఎంపై బూతులు తిడితే ఎవ‌రైనా ఊరుకుంటారా? అని ఆయ‌న నిల‌దీశారు.

రాష్ట్రంలో ప్ర‌స్తుతం నెల‌కొన్న పరిస్థితులకు చంద్రబాబు నాయుడు కారణం కాదా? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. రాజకీయాల్లో ఇలాంటి వ్యాఖ్య‌లు మాట్లాడ‌డం త‌న జీవితంలో ఎన్న‌డూ విన‌లేద‌ని ఆయ‌న అన్నారు. చంద్రబాబు చరిత్ర మొత్తం కుట్ర‌లే ఉన్నాయ‌ని ఆయ‌న చెప్పారు. అప్ప‌ట్లో ఎన్టీఆర్‌ను సీఎం ప‌ద‌వి నుంచి దింపేయ‌డానికి చంద్ర‌బాబు ఏంచేశారో అందరికీ తెలుసని ఆయ‌న ఎద్దేవా చేశారు. 
Go Back to Shorts
Botsa
YSRCP
Andhra Pradesh

More Telugu News