దెయ్యం భయంతో గ్రామం ఖాళీ... గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే శంకర్ నాయక్
- పాటిమీదిగూడెం గ్రామంలో దెయ్యం భయం
- కొన్నిరోజుల వ్యవధిలో 8 మంది మరణం
- దెయ్యం తిరుగుతోందని చెప్పిన భూతవైద్యుడు
- ఒకరోజు పాటు ఊరు ఖాళీ చేయాలని సూచన
ఈ విషయం స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్ చెవినపడడంతో ఆయన ఆశ్చర్యపోయారు. వెంటనే పాటిమీదిగూడెం గ్రామంలో స్వయంగా పర్యటించారు. క్షేత్రస్థాయి పరిస్థితులను గుర్తించారు. అనంతరం మాట్లాడుతూ, ఇక్కడ గుడుంబానే అసలు దెయ్యం అని స్పష్టం చేశారు. గుడుంబా తాగడం మానేస్తే అన్ని పరిస్థితులు చక్కబడతాయని హితవు పలికారు.