'శ్రీవల్లి' సాంగ్ కి 20 మిలియన్ వ్యూస్ .. తను కూడా తగ్గేదే లే అంటోందే!

18-10-2021 Mon 18:36
  • చివరిదశకు చేరుకున్న 'పుష్ప' చిత్రీకరణ
  • ఈ నెలాఖరుతో షూటింగు పార్టు పూర్తి
  • వచ్చేనెలలో నిర్మాణానంతర పనులు
  • డిసెంబర్ 17వ తేదీన విడుదల    
Pushpa movie update
అల్లు అర్జున్ - రష్మిక జంటగా సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' సినిమా షూటింగు జరుపుకుంటోంది. దాదాపుగా షూటింగు చివరిదశకు చేరుకుంది. ఈ నెలాఖరుతో ఈ సినిమా షూటింగు పార్టు పూర్తవుతుందని అంటున్నారు. వచ్చేనెలలో మిగతా పనులు పూర్తిచేసి, డిసెంబర్ 17వ తేదీన విడుదల చేయనున్నారు.

ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఒక్కో లిరికల్ వీడియో సాంగును వదులుతున్నారు. ముందుగా రిలీజ్ చేసిన 'దాక్కో దాక్కో మేక' లిరికల్ వీడియో రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది. రీసెంట్ గా వదిలిన 'శ్రీవల్లీ' పాట కూడా ఒక రేంజ్ లో జనంలోకి వెళ్లింది. ఈ పాటను కూడా ఈ సినిమాను విడుదల చేయనున్న 5 భాషల్లో వదిలారు.

5 భాషల్లో కలుపుకుని ఇంతవరకూ ఈ పాట 20 ప్లస్ మిలియన్ వ్యూస్ ను రాబట్టడం విశేషంగా చెబుతున్నారు. చాలా తక్కువ సమయంలో ఎక్కువ వేగంతో వ్యూస్ తెచ్చుకున్న పాటల జాబితాలో ఇది కూడా చేరనుందని చెబుతున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన ఈ పాట ఎలాంటి రికార్డులు నమోదు చేస్తుందో చూడాలి.