నేడు కాంగ్రెస్ సీడబ్ల్యూసీ భేటీ.. కాంగ్రెస్ చీఫ్ ఎవరో తేలిపోనుందా?
- మరికాసేపట్లో ప్రారంభం కానున్న సీడబ్ల్యూసీ భేటీ
- పంజాబ్, చత్తీస్‌గఢ్ రాజకీయ పరిణామాలపై చర్చ
- పూర్తిస్థాయిలో సంస్థాగత ఎన్నికలు నిర్వహించాలన్న యోచనలో అధిష్ఠానం
- వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ వ్యూహంపైనా చర్చ
ప్రస్తుతం కాంగ్రెస్ తాత్కాలిక చీఫ్‌గా సోనియాగాంధీ కొనసాగుతున్నారు. రాహుల్ గాంధీ తిరిగి ఆమె నుంచి బాధ్యతలు స్వీకరించాలని కొందరు నేతలు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు మధ్యంతర ఎన్నికలు నిర్వహించడానికి బదులు సంస్థాగత ఎన్నికలను పూర్తిస్థాయిలో నిర్వహించడమే మంచిదన్న ఆలోచనలో అధిష్ఠానం ఉన్నట్టు సమాచారం. అలాగే, వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో పార్టీ వ్యూహంపైనా ఈ సమావేశంలో చర్చించనున్నట్టు తెలుస్తోంది.