ఐదు భాషల్లో 'శ్రీవల్లి' పాట... లింకులు పంచుకున్న అల్లు అర్జున్

13-10-2021 Wed 20:32
  • 'పుష్ప' చిత్రం నుంచి మరో పాట రిలీజ్
  • దేవిశ్రీ ప్రసాద్ బాణీలు
  • తెలుగులో చంద్రబోస్ సాహిత్యం
  • హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోనూ 'శ్రీవల్లి' పాట
Allu Arjun shares multi lingual Srivalli song links

అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం 'పుష్ప'. ఈ చిత్రం నుంచి తాజాగా 'శ్రీవల్లి' అనే గీతం రిలీజైన సంగతి తెలిసిందే. ఈ పాట ప్రస్తుతం ఐదు భాషల్లో స్ట్రీమింగ్ అవుతోందని అల్లు అర్జున్ వెల్లడించారు. తెలుగు, హిందీ, మలయాళం, తమిళం, కన్నడ భాషల్లో 'శ్రీవల్లి' పాట తాలూకు లింకులను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ పాటకు యూట్యూబ్ లో విశేష స్పందన లభిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ బాణీలు అందించగా, తెలుగులో చంద్రబోస్ సాహిత్యం అందించారు. ఈ పాట రిలీజైన కొన్ని గంటల్లోనే 4.6 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.