CM Jagan: నూతన సీజే ప్రశాంత్ కుమార్ మిశ్రాకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్

CM Jagan wishes the best to newly appointed CJ Prashant Kumar Mishra
  • ఏపీ హైకోర్టుకు కొత్త సీజే
  • నూతన ప్రధాన న్యాయమూర్తిగా ప్రశాంత్ కుమార్ మిశ్రా
  • ప్రమాణస్వీకారం చేయించిన గవర్నర్
  • విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కార్యక్రమం
  • హాజరైన సీఎం జగన్
ఇటీవల వరకు ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి ఛత్తీస్ గఢ్ హైకోర్టుకు బదిలీ కావడం తెలిసిందే. ఆయన స్థానంలో జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా నియమితులయ్యారు. మిశ్రా నేడు ఏపీ హైకోర్టు సీజేగా బాధ్యతలు అందుకున్నారు. జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాతో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణస్వీకారం చేయించారు.

విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఈ కార్యక్రమానికి సీఎం జగన్ కూడా హాజరయ్యారు. నూతన సీజే ప్రశాంత్ కుమార్ మిశ్రాకు శుభాకాంక్షలు తెలియజేశారు.
CM Jagan
CJ
Prasant Kumar Mishra
AP High Court

More Telugu News