చేతిపై నటి హేమ కొరకడంతో టీటీ ఇంజెక్షన్ వేయించుకున్న శివబాలాజీ

10-10-2021 Sun 18:08
  • 'మా' ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఘటన
  • హేమ, శివబాలాజీ మధ్య వివాదం
  • చేతిని అడ్డుపెట్టడంతో కొరికానన్న హేమ
  • శివబాలాజీ చేతిపై చిన్న గాయం
  • నిమ్స్ లో చికిత్స
Sivabalaji takes TT Injection after Hema bitten him

'మా' ఎన్నికల పోలింగ్ కేంద్రం వద్ద చోటుచేసుకున్న ఉద్రిక్తతల నేపథ్యంలో, నటి హేమ తీవ్ర ఆగ్రహంతో శివబాలాజీ చేతిపై కొరకడం తెలిసిందే. తనను అడ్డుకోవడానికి శివబాలాజీ ప్రయత్నించాడని, అందుకే తాను కొరకాల్సి వచ్చిందని ఆ తర్వాత హేమ వివరణ ఇచ్చారు.

హేమ కొరకడంతో శివబాలాజీ చేతిపై గాయం అయింది. పంటిగాట్ల కారణంగా సెప్టిక్ అవుతుందేమోనన్న భయంతో శివబాలాజీ టీటీ ఇంజెక్షన్ వేయించుకున్నారు. ఓటింగ్ అనంతరం నిమ్స్ కు వెళ్లిన ఆయన చేతిపై గాయానికి చికిత్స పొందారు. కాగా, హేమ తన చేతిని కొరికినప్పటికీ శివబాలాజీ పెద్దగా ఆగ్రహం చూపకుండా, సంయమనం పాటించడం విజువల్స్ లో కనిపించింది.