పాకిస్థాన్ 'అణు పితామహుడు' అబ్దుల్ ఖదీర్ ఖాన్ కన్నుమూత
- కరోనాతో కన్నుమూసిన ఖదీర్ ఖాన్
- ఏక్యూ ఖాన్ గా గుర్తింపు పొందిన అణు శాస్త్రవేత్త
- సంతాపం తెలిపిన ప్రధాని ఇమ్రాన్ ఖాన్
- దేశాన్ని అణుశక్తిగా నిలిపారంటూ కితాబు
అయితే పాశ్చాత్య దేశాల నుంచి అణు పరిజ్ఞానాన్ని దొంగిలించి వాటితో అణ్వస్త్రాలు రూపొందించాడన్న అపవాదును ఆయన ఎదుర్కొన్నారు. అంతేకాదు, పాక్ అణు రహస్యాలను ఉత్తర కొరియా, ఇరాన్ వంటి దేశాలకు చేరవేశాడన్న ఆరోపణలపై అరెస్ట్ కూడా అయ్యారు.
ఖదీర్ ఖాన్ మృతి పట్ల ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంతాపం తెలియజేశారు. నేషనల్ ఐకాన్ ను కోల్పోయామని విచారం వ్యక్తం చేశారు. దేశం ఆయనను ఎంతగానో ప్రేమించిందని, ఎందుకంటే ఆయన పాక్ ను ఓ అణుశక్తిగా నిలిపారని కొనియాడారు.