హైదరాబాదులో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం

Rain lashes again in Hyderabad city
  • నగరంలో మరోసారి వాన
  • వర్షానికి తోడు ఈదురుగాలులు
  • ఆందోళనకు గురవుతున్న ప్రజలు
  • అండమాన్ సముద్రంలో కొనసాగుతున్న అల్పపీడనం
హైదరాబాదును వరుణుడు ఇప్పట్లో వీడేట్టు కనిపించడంలేదు! అండమాన్ వద్ద సముద్రంలో అల్పపీడనం కొనసాగుతున్న నేపథ్యంలో నగరంలో వర్షాలు కురుస్తున్నాయి. నేడు కూడా నగరంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. దిల్ సుఖ్ నగర్, చెంగిచెర్ల, అంబర్ పేట, సరూర్ నగర్, కుషాయిగూడ, హియాయత్ నగర్, రామాంతపూర్, నారాయణగూడ, నాంపల్లి, లక్డీకాపూల్, చైతన్యపురి, మలక్ పేట, సైదాబాద్, ఉప్పల్, కొత్తపేట తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దాంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.

వర్షానికి ఈదురుగాలులు కూడా తోడవడంతో వాహనదారులు ఇబ్బందిపడుతున్నారు. నిన్న కురిసిన వర్షం నుంచే నగరం ఇంకా తేరుకోకపోగా, మరోసారి వర్షం పడడంతో నాలాలు ఉప్పొంగుతున్నాయి. దాంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
Go Back to Shorts
Hyderabad
Rain
City
Lightening
Thunders

More Telugu News