Kajal Agarwal: కాజల్ చెప్పాలనుకుంటున్న న్యూస్ అదేనా?

kajal movies upadate
షార్ట్స్‌లో చూడండి
కాజల్ తెలుగు తెర చందమామగా ప్రేక్షకుల నుంచి మార్కులు కొట్టేసింది. తెలుగుతో పాటు తమిళంలోను స్టార్ స్టేటస్ ను అందుకుంది. కొత్తగా ఎంతమంది కథానాయికలు వస్తున్నప్పటికీ, ఆ పోటీని తట్టుకుని నిలబడింది. ఇటీవలే ఆమె చిరంజీవి సరసన నాయికగా 'ఆచార్య' సినిమాను పూర్తిచేసింది.

ఇక ఆమె ఒప్పుకున్న సినిమాల జాబితాలో 'ఇండియన్ 2' .. నాగార్జున 'ఘోస్ట్' .. 'రౌడీ బేబీ' సినిమాలు ఉన్నాయి. అయితే ఈ సమయంలోనే కాజల్ ప్రెగ్నెన్సీ వార్త జోరుగా షికారు చేస్తోంది. ఆల్రెడీ తాను ఒప్పుకున్న ప్రాజెక్టుల నుంచి ప్రెగ్నెన్సీ కారణంగా తప్పుకోవాలని కాజల్ నిర్ణయించుకున్నట్టుగా వార్తలు వచ్చాయి.

కాజల్ కి బదులుగా 'రౌడీ బేబీ' సినిమాను హన్సిక చేస్తుండటంతో, కాజల్ ప్రెగ్నెన్సీ వార్త నిజమే కావచ్చునేమోనని అంతా అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే 'ఓ కొత్త ఎనౌన్స్ మెంట్ రాబోతోంది .. వేచి ఉండండి' అంటూ కాజల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆమె చెప్పాలనుకుంటున్నది తన ప్రెగ్నెన్సీ విషయమేనా? అనే ఆసక్తితో అభిమానులు ఎదురుచూస్తున్నారు.
Go Back to Shorts
Kajal Agarwal
Acharya
Ghost

More Telugu News