వీరి చావులు ప్రభుత్వానికి కనిపించడం లేదు: విజయశాంతి

Farmers death are not visible to TRS govt says Vijayashanti
  • రైతుల కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చామని ప్రభుత్వం చెపుతోంది
  • రైతుల ఆత్మహత్యలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి
  • వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ సర్కార్ కు ప్రజలు బుద్ధి చెపుతారు
టీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ నాయకురాలు విజయశాంతి మండిపడ్డారు. రాష్ట్రంలో రైతుల కోసం ఎన్నో పథకాలను తీసుకొచ్చామని, రైతుల అభివృద్ధికి కృషి చేస్తున్నామని టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్నా... రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయని అన్నారు. రైతులకు పంట రుణాలు ఇవ్వడంలో బ్యాంకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని చెప్పారు. దీంతో వీరికి ప్రైవేట్ రుణాలు తప్ప మరో ఆధారం లేదని అన్నారు.

ఈ రుణాలతో పెట్టుబడి వ్యయం తలకు మించిన భారంగా మారి, చేసిన అప్పులు తీర్చలేక ఉరికొయ్యలకు వేలాడుతున్నా వీరి చావులు ప్రభుత్వానికి కనిపించడం లేదని మండిపడ్డారు. రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే పట్టింపులేనట్టుగా వ్యవహరిస్తున్న టీఆర్ఎస్ సర్కార్‌ కు రానున్న ఎన్నికల్లో యావత్ తెలంగాణ ప్రజానీకం తగిన బుద్ధి చెబుతుందని అన్నారు.
Go Back to Shorts
Vijayashanti
BJP
TRS
Farmers

More Telugu News