షూటింగులో బిజీగా 'డేగల బాబ్జీ'
- కమెడియన్ గా గుర్తింపు
- భారీ చిత్రాల నిర్మాతగా పేరు
- మళ్లీ నటన దిశగా అడుగులు
- దర్శకుడిగా వెంకట్ చంద్ర
ఆ తరువాత ఆ మధ్య వచ్చిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో, ట్రైన్ ఎపిసోడ్ లో కనిపించి నవ్వించాడు. ఆయన ప్రధాన పాత్రధారిగా ఒక సినిమా రూపొందనున్నట్టు కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాను 'డేగల బాబ్జీ' సినిమా చేయనున్నట్టు ఆయన చెప్పాడు. ఆ వెంటనే ఆ సినిమాకి సంబంధించిన ఫస్టులుక్ పోస్టర్ కూడా వచ్చేసింది.
ఆ పోస్టర్ ను బట్టి క్రైమ్ నేపథ్యంలో ఈ కథ నడుస్తుందనే విషయం అర్థమైంది. ఈ సినిమా షూటింగు జరుగుతున్నట్టుగా బండ్ల గణేశ్ ఒక ట్వీట్ చేశాడు. ఈ సినిమా పక్కా డిఫరెంట్ గా ఉంటుందనీ, త్వరలోనే పూర్తవుతుందని రాసుకొచ్చాడు. వెంకట్ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను, స్వాతి చంద్ర నిర్మిస్తున్నారు.