Ravichandran Ashwin: నేనేం దొంగతనం చేయలేదు.. తప్పూ చేయలేదు: అశ్విన్

  • కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ కెప్టెన్‌ మోర్గాన్‌తో వివాదం
  • పంత్‌ చేతికి బంతి తగిలిన తర్వాత పరుగు తీసిన అశ్విన్
  • రెండుగా చీలిన క్రికెట్ ప్రపంచం
aswin on conflict with morgan

కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జట్టు సారధి ఇయాన్ మోర్గాన్‌తో వివాదంపై భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరోసారి స్పందించాడు. ఢిల్లీ, కోల్‌కతా మ్యాచ్‌ మధ్యలో ఫీల్డర్‌ విసిరిన బంతి పంత్‌ చేతికి తగిలి దూరం వెళ్లింది. ఆ సమయంలో అశ్విన్ మరో పరుగు తీశాడు. దీన్ని మోర్గాన్ తప్పుబట్టాడు. దీనిపై పెద్ద దుమారమే రేగింది.

ఈ క్రమంలో ఇటీవల ట్విట్టర్ వేదికగా సుదీర్ఘ వివరణ ఇచ్చిన అశ్విన్ మరోసారి తన యూట్యూబ్ ఛానెల్‌లో ఈ విషయంపై మాట్లాడాడు. తానేమీ తప్పుచేయలేదని, దొంగతనం అసలు చేయలేదని స్పష్టం చేశాడు.

'స్పిరిట్ ఆఫ్ క్రికెట్' అంటూ తనపై విమర్శలు చేయకూడదని అన్నాడు. తాను ఎటువంటి నిబంధనలూ ఉల్లంఘించలేదని, తనకు తెలిసినట్లు ఆట ఆడానని తేల్చిచెప్పాడు. స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అనేది క్రీడలో సరైన నిబంధనలు లేని సమయంలో పెట్టుకుందని, ఇప్పుడు దాంతో పెద్దగా అవసరం లేదనే అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు.

కాగా, అశ్విన్ వివాదంపై దిగ్గజ క్రికెటర్లు కూడా స్పందించారు. గంభీర్, సెహ్వాగ్ వంటి వారు అశ్విన్‌ను వెనకోసుకొచ్చారు. వార్న్ వంటి వారు అశ్విన్‌ చేసిన పనిని తప్పుబట్టిన సంగతి తెలిసిందే.

More Telugu News