Venkat Balmoori: విద్యార్థి సంఘం నేతకు హుజూరాబాద్ టికెట్ ఇచ్చిన కాంగ్రెస్

Congress announced candidate for Huzurabad By Elections
  • ఎన్ఎస్ యూఐ అధ్యక్షుడు వెంకట్ బల్మూరికి కాంగ్రెస్ టికెట్
  • ఈ నెల 30న హుజూరాబాద్ ఉప ఎన్నిక
  • టీఆర్ఎస్ విద్యార్థి నేతకు టికెట్ ఇచ్చిన కేసీఆర్
  • వ్యూహాత్మకంగా వ్యవహరించిన కాంగ్రెస్
  • విద్యార్థి నేత వెంకట్ కు అవకాశం
త్వరలో హుజూరాబాద్ ఉప ఎన్నికలు జరగనుండగా, కాంగ్రెస్ కూడా తన అభ్యర్థిని ప్రకటించింది. ఎన్ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ బల్మూరి హుజూరాబాద్ ఉప ఎన్నిక బరిలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తాడని ఏఐసీసీ ఓ ప్రకటన చేసింది. వెంకట్ బల్మూరి ఇటీవల కాలంలో కాంగ్రెస్ నిరసన ప్రదర్శనలు, ధర్నాల్లో ముందు నిలిచి పోరాడుతూ పార్టీ అధిష్ఠానం దృష్టిలో పడ్డాడు.

హుజూరాబాద్ అభ్యర్థిపై పార్టీలో చర్చ జరగ్గా, వెంకట్ పేరును సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమర్థించడంతో వెంకట్ అభ్యర్థిత్వం ఖరారైంది.

హుజూరాబాద్ బరిలో వెంకట్ ను ఎంచుకోవడం వెనుక కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ టీఆర్ఎస్ విద్యార్థి విభాగం అధ్యక్షుడు. దాంతో కాంగ్రెస్ కూడా తమ విద్యార్థి విభాగం నేత వెంకట్ బల్మూరిని రంగంలోకి దింపాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.
Venkat Balmoori
Congress
Huzurabad
NSUI
Telangana

More Telugu News