షార్జాలో ఇసుక తుపాను... బెంగళూరు, చెన్నై మ్యాచ్ టాస్ ఆలస్యం

24-09-2021 Fri 19:27
  • ఐపీఎల్ లో నేడు ఆసక్తికర మ్యాచ్
  • అడ్డు తగిలిన ఇసుక తుపాను
  • షార్జా నగరాన్ని కమ్మేసిన ఇసుక దుమారం
  • పరిస్థితిని సమీక్షిస్తున్న అధికారులు
 IPL Match in Sharjah delayed due to sandstorm
ఐపీఎల్ కు ఆతిథ్యమిస్తున్న యూఏఈలో అప్పుడప్పుడు ఇసుక తుపానులు సంభవిస్తుంటాయి. నేడు చెన్నై, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ కు వేదికగా నిలుస్తున్న షార్జాలో ప్రస్తుతం ఇసుక తుపాను కమ్మేసింది. దాంతో ఈ మ్యాచ్ కు టాస్ వేయడం ఆలస్యం అయింది. భారత కాలమానం ప్రకారం టాస్ 7 గంటలకు, మ్యాచ్ ప్రారంభం 7.30 గంటలకు జరగాల్సి ఉంది. అయితే, షార్జాలో ఇసుక దుమారం రేగడంతో మ్యాచ్ ప్రారంభానికి అంతరాయం ఏర్పడింది.