'నయట్టు' తెలుగు రీమేక్ గా 'బ్రాకెట్'!
- మలయాళంలో హిట్ కొట్టిన 'నయట్టు'
- తెలుగు టైటిల్ గా 'బ్రాకెట్'
- నవంబర్ నుంచి సెట్స్ పైకి
- ప్రధానమైన పాత్రలో అంజలి
అందువల్లనే ఆ తరహా కథలను తెలుగులో రీమేక్ చేయడానికి ఆయన ఆసక్తిని చూపుతున్నారు. ఈ ఏడాది ఆరంభంలో మలయాళంలో విడుదలై విజయవంతమైన 'నయట్టు' సినిమాను, ఆయన తెలుగులో రీమేక్ చేయనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
ఈ సినిమాకి ఆయన 'బ్రాకెట్' అనే టైటిల్ ను ఖరారు చేసి .. రిజిస్టర్ చేయించినట్టుగా తెలుస్తోంది. 'శ్రీదేవి సోడా సెంటర్' దర్శకుడు కరుణ కుమార్ ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడు. అంజలి .. రావు రమేశ్ .. సత్యదేవ్ ప్రధానమైన పాత్రల్లో కనిపించనున్నారు. నవంబర్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలుకానుందని చెబుతున్నారు.