ప్రత్యేక విమానాల్లో విదేశాలకు డబ్బులు తరలిస్తున్నారు: బొండా ఉమ
- ఏపీని వైసీపీ నేరాంధ్రప్రదేశ్ గా మార్చింది
- వైసీపీ మద్దతుతోనే సుధాకర్ డ్రగ్స్ వ్యాపారాన్ని మొదలుపెట్టాడు
- జగన్ నాయకత్వంలో ఆ పార్టీ నేతలు పది తరాలకు సరిపడా సంపాదించారు
ఎర్రచందనాన్ని వైసీపీ నేతలు ప్రతి రోజు విదేశాలకు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. తిరుమల వేంకటేశ్వరస్వామికి భక్తులు సమర్పించిన తల వెంట్రుకలను కూడా విదేశాలకు ఎగుమతి చేస్తున్నారని మండిపడ్డారు. వెంట్రుకలను తరలిస్తూ ఇటీవలే పక్కరాష్ట్రాల్లో దొరికిపోయారని అన్నారు. జగన్ నాయకత్వంలో వైసీపీ నేతలు పది తరాలకు సరిపడా సంపాదించారని చెప్పారు. ప్రత్యేక విమానాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు విదేశాలకు డబ్బు తరలిస్తున్నారని అన్నారు.