Revanth Reddy: కేసీఆర్ కూడా రెడీ అయితే.. లై డిటెక్టర్ టెస్టుకు నేను సిద్ధం: కేటీఆర్ కు రేవంత్ ప్రతిసవాల్

If KCR is ready I am ready for lie detector test says Revanth Reddy in response to KTR challenge
  • ఓటుకు నోటు కేసులో లై డిటెక్టర్ టెస్టుకు సిద్ధమా? అని కేటీఆర్ సవాల్
  • సహారా, ఈఎస్ఐ కుంభకోణాల కేసుల్లో లై డిటెక్టర్ టెస్టుకు కేసీఆర్ సిద్ధమా? అని రేవంత్ ప్రశ్న
  • టైమ్, ప్లేస్ చెప్పాలంటూ కేటీఆర్ కు సవాల్
మంత్రి కేటీఆర్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిలు పరస్పరం విసురుకుంటున్న సవాళ్లతో తెలంగాణ రాజకీయం వేడెక్కింది. డ్రగ్స్ వాడేవాళ్లకు కేటీఆర్ బ్రాండ్ అంబాసడర్ అని రేవంత్ తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు అమరవీరుల స్తూపం వద్ద వేచి చూస్తుంటానని... దమ్ముంటే రావాలంటూ కేటీఆర్ కు రేవంత్ తాజాగా సవాల్ విసిరారు. దీనికి ప్రతిస్పందనగా టెస్టుకు తాను సిద్ధమని, అయితే తనతో పాటు రాహుల్ గాంధీ కూడా పరీక్షలు చేయించుకోవడానికి రావాలంటూ కేటీఆర్ సవాల్ విసిరారు. ఓటుకు నోటు కేసులో లై డిటెక్టర్ పరీక్షకు మీరు సిద్ధమా? అని ఛాలెంజ్ చేశారు.

కేటీఆర్ విసిరిన సవాల్ కు రేవంత్ అదే స్థాయిలో ప్రతిస్పందించారు. లై డిటెక్టర్ పరీక్షకు తాను సిద్ధమని... సహారా ప్రావిడెంట్ ఫండ్, ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణం కుంభకోణాల్లో సీబీఐ కేసుల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా లై డిటెక్టర్ పరీక్షలకు సిద్ధం కావాలని అన్నారు. కేసీఆర్ సిద్ధమైతే టెస్టుకు తాను కూడా సిద్ధమని... టైమ్, ప్లేస్ చెప్పాలంటూ కేటీఆర్ కు సవాల్ విసిరారు.
Revanth Reddy
Congress
KCR
KTR
TRS
Lie Detector Test

More Telugu News