Venkatesh Daggubati: 'దృశ్యం 2' ఫస్టులుక్ పోస్టర్ రిలీజ్ వాయిదా

Dtishyam 2 first look release postponed
  • భారీ విజయాన్ని సాధించిన 'దృశ్యం'
  • సీక్వెల్ గా రూపొందిన 'దృశ్యం 2'
  • దర్శకుడిగా జీతూ జోసెఫ్
  • త్వరలో ఫస్టులుక్ రిలీజ్  
మలయాళంలో ఆ మధ్య వచ్చిన 'దృశ్యం' వైవిధ్యభరితమైన చిత్రంగా ప్రశంసలను అందుకుంది. తెలుగు రీమేక్ లో వెంకటేశ్ చేయగా, ఇక్కడ కూడా ఈ కథకి విశేషమైన ఆదరణ లభించింది. మధ్యతరగతి కుటుంబానికి చెందిన ప్రతి ఆడపిల్ల తండ్రికి ఈ కథ కనెక్ట్ అయింది. దాంతో భారీ వసూళ్లతో అనూహ్యమైన విజయాన్ని సాధించింది.

ఇక ఈ మధ్య మలయాళంలో వచ్చిన 'దృశ్యం 2' .. మొదటి భాగానికి మించిన రెస్పాన్స్ ను తెచ్చుకుంది. మూలకథను తెరకెక్కించిన జీతూ జోసెఫ్ దర్శకత్వంలోనే తెలుగులో ఈ సినిమాను నిర్మించారు. రెండు నెలలలోపే ఈ సినిమా షూటింగును పూర్తిచేయడం విశేషం.

ఈ సినిమా నుంచి ఈ రోజు ఉదయం ఫస్టులుక్ పోస్టర్ ను రిలీజ్ చేస్తామని రీసెంట్ గా అధికారిక ప్రకటన చేశారు. ఫస్టు లుక్ కోసం అంతా ఆసక్తితో ఎదురుచూస్తుండగా, కొన్ని అనివార్య కారణాల వలన ఫస్టులుక్ పోస్టర్ రిలీజ్ విడుదలలో జాప్యం జరుగుతున్నట్టు పేర్కొంటూ, మరో ప్రకటన వదిలారు. అసౌకర్యానికి చింతిస్తున్నామని చెప్పారు. మరి ఫస్టులుక్ ను ఎప్పుడు వదులుతారో చూడాలి.  
Venkatesh Daggubati
Meena
Jeethu Joseph

More Telugu News