Prabhudeva: డైరెక్షన్ చేయనంటున్న ప్రభుదేవా!

Prabhudeva stopped directing movies
  • కొరియోగ్రఫర్ గా క్రేజ్ 
  • నటుడిగా మంచి గుర్తింపు 
  • దర్శకుడిగా బాలీవుడ్లో బిజీ 
  • ఇకపై నటనపైనే పూర్తి దృష్టి    
తెలుగు తెరపై డాన్సుల విషయం ప్రస్తావనకు వస్తే, ప్రభుదేవా రావడానికి ముందు .. ఆ తరువాత అనేసే చెప్పుకోవాలి. అలా ఆయన కొరియోగ్రఫర్ గా ఒక కొత్త ట్రెండ్ ను సృష్టించాడు. తాను డాన్స్ కంపోజ్ చేసిన సినిమాల్లో ఒక ప్రత్యేకమైన పాటలో మెరవడం ప్రభుదేవాకు అలవాటుగా మారింది.

డాన్సర్ గా వచ్చిన విపరీతమైన క్రేజ్ తోనే ఆయన హీరో అయ్యాడు. అప్పటి నుంచి ఆయన ఒకరిద్దరు హీరోల సినిమాలకి తప్ప కొరియోగ్రఫీని చేయలేదు. హీరోగా బిజీగా ఉన్న సమయంలోనే ఆయన డైరెక్షన్ పై దృష్టి పెట్టాడు. తెలుగులో ఎమ్మెస్ రాజు బ్యానర్లో రెండు సినిమాలకి దర్శకత్వం వహించిన ఆయన, ఆ తరువాత బాలీవుడ్ పై దృష్టి పెట్టారు.

హిందీలో స్టార్ హీరోలతో రీమేక్ సినిమాలు ఎక్కువగా చేశాడు. ఆ తరువాత అక్కడ గ్రాఫ్ పడిపోతూ ఉండటంతో తిరిగి చెన్నైకి చేరుకున్నాడు. ఇకపై డైరెక్షన్ చేయకూడదని నిర్ణయించుకున్న ఆయన, నటన పైనే పూర్తి దృష్టి పెట్టాడని చెబుతున్నారు. నటుడిగా వరుస అవకాశాలు వస్తున్న కారణంగానే ఆయన ఈ నిర్ణయానికి వచ్చాడని చెప్పుకుంటున్నారు.
Prabhudeva
Kollywood

More Telugu News