Amaravati: అమరీందర్ వ్యాఖ్యలను పట్టించుకోని కాంగ్రెస్ హైకమాండ్.. సిద్ధూని వెనకేసుకొచ్చిన వైనం!

Congress clarifies that will go for assembly elections under Sudhu leadership
  • పాక్ ప్రధాని, ఆర్మీ చీఫ్ లతో సిద్ధూకి సాన్నిహిత్యం ఉందన్న అమరీందర్
  • రాష్ట్రంలో సిద్ధూకు చాలా పాప్యులారిటీ ఉందన్న పార్టీ నాయకత్వం
  • సిద్ధూ నాయకత్వంలోనే ఎన్నికలకు వెళ్తామని స్పష్టీకరణ
వచ్చే ఏడాది పంజాబ్ శాసనసభకు ఎన్నికలు జరగబోతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. సీఎం అమరీందర్ సింగ్ ను సాగనంపింది. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన అమరీందర్ సింగ్ పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూపై తీవ్ర ఆరోపణలు చేశారు. పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ఆ దేశ ఆర్మీ చీఫ్ బజ్వాలతో సిద్ధూకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అన్నారు. సిద్ధూ వల్ల పంజాబ్ రక్షణకు ముప్పు ఉందనే విధంగా వ్యాఖ్యలు చేశారు.

అయితే అమరీందర్ వ్యాఖ్యలను పార్టీ హైకమాండ్ పట్టించుకోలేదు. సిద్ధూకు అనుకూలంగా మాట్లాడింది. సిద్ధూ నాయకత్వంలోనే పంజాబ్ ఎన్నికలకు వెళ్తామని పంజాబ్ కాంగ్రెస్ ఇన్ఛార్జి రావత్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో సిద్ధూకు చాలా పాప్యులారిటీ ఉందని, పార్టీని నడిపించే సత్తా గల నాయకుడు సిద్ధూ అని ప్రశంసించారు. ఎన్నికల్లో ఎవరెవరు పోటీ చేస్తారనే విషయాన్ని పార్టీ హైకమాండ్ నిర్ణయిస్తుందని చెప్పారు.
Amaravati
Navjot Singh Sidhu
Congress
Punjab
Assembly Elections

More Telugu News