దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సుకు కేటీఆర్
- వచ్చే ఏడాది జనవరి 17 నుంచి 21 వరకు దావోస్ సదస్సు
- ఆహ్వానించిన వేదిక అధ్యక్షుడు బోర్గ్ బెండె
- రాష్ట్ర ప్రభుత్వానికి దక్కిన గౌరవమన్న కేటీఆర్
అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకోవడంతోపాటు వాటిని ప్రజాప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం, సామర్థ్యం పెంపుదల, సహకార మార్గాలపై కేటీఆర్ తన అభిప్రాయాలను వార్షిక సదస్సులో పంచుకోవాలని బోర్గ్ కోరారు. ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొనాలంటూ తనకు అందిన ఆహ్వానంపై కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. దీనిని రాష్ట్ర ప్రభుత్వానికి దక్కిన గౌరవంగా భావిస్తున్నట్టు చెప్పారు. ఈ అవకాశాన్ని ప్రపంచస్థాయి సంస్థల నుంచి పెట్టుబడులను ఆకర్షించేందుకు అనువుగా మార్చుకుంటామని అన్నారు.