Ramcharan: రామ్ చరణ్ ఇటీవల కొన్న కొత్త కారు ప్రత్యేకతలు ఇవే!

  • రామ్ చరణ్ గ్యారేజిలో కొత్త కారు
  • మెర్సిడెస్ మేబాక్ జీఎల్ఎస్-600 కొనుగోలు
  • ఇటీవలే కారును చరణ్ కు అప్పగించిన మెర్సిడెస్
  • చరణ్ అభిరుచులకు అనుగుణంగా మార్పులు
Specifications and features of Ram Charan newly bought Mercedes Maybach car

టాలీవుడ్ లో అగ్రశ్రేణి హీరోగా ఎదిగిన రామ్ చరణ్ కు కార్లంటే మోజు అని తెలిసిందే. చరణ్ గ్యారేజిలో అనేక విదేశీ కార్లు ఉన్నాయి. కొన్నిరోజుల కిందటే ఆ జాబితాలో కొత్త కారు వచ్చి చేరింది. అది మెర్సిడెస్ మేబాక్ జీఎల్ఎస్-600 మోడల్ కారు. దీని ఖరీదు అక్షరాలా రూ.2.43 కోట్లు (ఎక్స్ షోరూం).

ఇటీవల మెర్సిడెస్ సంస్థ సిబ్బంది ఈ అల్ట్రామోడ్రన్ ఎస్ యూవీని రామ్ చరణ్ కు నేరుగా సెట్స్ పైకి తీసుకువచ్చి అందించారు. రామ్ చరణ్ తన అభిరుచుల మేరకు ఈ కారుకు కొన్ని సూచనలు చేయగా, మెర్సిడెస్ సంస్థ ఆమేరకు మార్పులు చేర్పులు చేసింది. దాంతో కారు ఖరీదు కాస్తా రూ.4 కోట్లకు చేరినట్టు తెలుస్తోంది. హైఎండ్ ఎస్ యూవీ సెగ్మెంట్లో మెర్సిడెస్ మేబాక్ జీఎల్ఎస్-600 కచ్చితంగా ముందువరుసలో నిలుస్తుంది.

రామ్ చరణ్ కొన్న మెర్సిడెస్ ప్రత్యేకతలు ఏంటంటే...

  • మోనోటోన్ కవాన్సైట్ బ్లూ షేడ్ కలర్ లో కాంతులీనుతున్న కారు.
  • కారులో 4 ఇండివిడ్యువల్ సీట్లు. లగ్జరీ, కంఫర్ట్ కు పెద్దపీట.
  • డ్యూయల్ టోన్ బ్రౌన్ ఇంటీరియర్. కారు లోపలి భాగంలో అత్యంత నాణ్యమైన నప్పా లెదర్ వినియోగం.
  • రిక్లైనింగ్ రియర్ సీట్లు, ఎలక్ట్రానిక్ పనోరమిక్ స్లైడింగ్ సన్ రూఫ్, వెంటిలేటెడ్ మసాజ్ సీట్లు.
  • పరిస్థితులకు తగిన విధంగా లైటింగ్ ను అడ్జస్ట్ చేసుకునే సదుపాయం.
  • 12.3 అంగుళాల లేటెస్ట్ ఎంబీయూఎక్స్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్.
  • హేయ్ మెర్సిడెస్ వాయిస్ కమాండ్ వ్యవస్థ, మెర్సిడెస్ మి కనెక్టెడ్ కార్ టెక్ సహితం.
  • 4 లీటర్ బీఐ టర్బో వీ8 ఇంజిన్. 9జీ ట్రానిక్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్.
  • అత్యుత్తమ పికప్ కోసం 48 వోల్ట్ ఈక్యూ బూస్ట్ సిస్టమ్.
  • కేవలం 4.9 సెకన్లలోనే 100 కిమీ వేగం, టాప్ స్పీడ్ గంటకు 250 కిలోమీటర్లు.

More Telugu News