Telangana: గ్రామీణ ప్రాథమిక వైద్యంలో తెలంగాణకు జాతీయస్థాయిలో మొదటి స్థానం

  • పట్టణ పీహెచ్‌సీల కేటగిరీలో రెండో స్థానం
  • వివరాలు వెల్లడించిన కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ
  • 2017 నుంచి తెలంగాణలో ‘నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ ప్రోగ్రామ్’ అమలు
Telanganas primary healthcare centres ranked best in quality

ప్రాథమిక వైద్యం విషయంలో జాతీయ స్థాయిలో తెలంగాణకు మొదటి ర్యాంకు లభించింది. గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అందిస్తున్న ఉత్తమ సేవలకు గాను ఈ స్థానం లభించింది. పట్టణ పీహెచ్‌సీల విభాగంలో రెండో స్ధానాన్ని దక్కించుకుంది. 2018-19 నుంచి 2020-21 సంవత్సరాలకు గాను ఈ పురస్కారాలు లభించాయి. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ నిన్న ఈ వివరాలను వెల్లడించారు.

రోగికి సంతృప్తికర వైద్యసేవలు అందించే విషయంలో ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ‘నాణ్యత ప్రమాణాల ధ్రువపత్రాలను’ కేంద్రం ప్రతి సంవత్సరం అందిస్తోంది. దీనిని ‘నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ ప్రోగ్రామ్’ (NQAS ) అని పిలుస్తున్నారు. 2017 నుంచి ఈ కార్యక్రమాన్ని తెలంగాణలో అమలు చేస్తున్నారు.

రాష్ట్రంలోని 106 ఆసుపత్రులకు ఇప్పటికే ఈ ధ్రువీకరణ పత్రాలు లభించాయి. త్వరలో మరో 20 పీహెచ్‌సీలకు ఈ పత్రాలు లభించే అవకాశం ఉందని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ వాకాటి కరుణ తెలిపారు. ఈ ధ్రువీకరణ పత్రాలు లభించిన కేంద్రాలకు మూడేళ్లపాటు ప్రతి సంవత్సరం కేంద్రం నుంచి రూ. 3 లక్షల నగదు పారితోషికం లభిస్తుంది.

More Telugu News