Gorantla Butchaiah Chowdary: బయట తిరగలేరంటూ వైసీపీ నేతలకు గోరంట్ల బుచ్చయ్య చౌదరి హెచ్చరిక

Gorantla Butchaiah Chowdary warns YSRCP leaders
  • చంద్రబాబుపై వైసీపీ నేతలు నీచ భాషను ఉపయోగించినప్పుడు డీజీపీకి వినిపించలేదా? 
  • అయ్యన్నపాత్రుడు నిజాలు చెపితే భరించలేకపోతున్నారు
  • రెండు చెంపల మీద కొట్టే సత్తా టీడీపీకి ఉంది
ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను ఉద్దేశించి టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయం అట్టుడుకుతోంది. ఈ వ్యాఖ్యలకు నిరసనగా చంద్రబాబు నివాసంపై వైసీసీ ఎమ్మెల్యే జోగి రమేశ్ తన అనుచరులతో కలిసి దాడికి యత్నించారు. ఈ సందర్భంగా టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య పెద్ద ఘర్షణ చోటుచేసుకుంది. అనంతరం ఇరుపక్షాలు ఒకరిపై మరొకరు డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేసుకున్నారు. దాని తర్వాత కూడా ఇరు పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.

తాజాగా టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పందిస్తూ వైసీపీ, డీజీపీ గౌతమ్ సవాంగ్ పై మండిపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ నేతలు నీచమైన భాషను ఉపయోగించినప్పుడు డీజీపీకి వినిపించలేదా? అప్పుడు పోలీసులు కళ్లు మూసుకుని కూర్చున్నారా? అంటూ మండిపడ్డారు.

అయ్యన్నపాత్రుడు వాస్తవాలను చెపితే ఎందుకు భరించలేకపోతున్నారని ప్రశ్నించారు. టీడీపీ నేతలు ఎంతో క్రమశిక్షణతో ఉంటారని.... క్రమశిక్షణ తప్పితే వైసీపీ నేతలు బయట తిరగలేరని అన్నారు. ఒక చెంప మీద కొడితే... రెండు చెంపల మీద కొట్టే సత్తా టీడీపీకి ఉందని చెప్పారు.
Gorantla Butchaiah Chowdary
Telugudesam
Chandrababu
YSRCP
AP DGP

More Telugu News