Pavan Kalyan: 'భీమ్లా నాయక్' నుంచి రానున్న రానా టీజర్!

  • మలయాళ రీమేక్ గా 'భీమ్లా నాయక్'
  • ప్రధాన పాత్రల్లో పవన్ - రానా
  • కథానాయికలుగా నిత్యా మీనన్ - ఐశ్వర్య రాజేశ్
  • జనవరి 12వ తేదీన విడుదల  
Bheemla Nayak movie update

పవన్ కల్యాణ్ కథానాయకుడిగా 'భీమ్లా నాయక్' సినిమా రూపొందుతోంది. కొంతకాలం క్రితం మలయాళంలో విజయవంతమైన 'అయ్యప్పనుమ్ కోషియుమ్' సినిమాకి ఇది రీమేక్. రానా కూడా మరో ప్రధానమైన పాత్రను పోషిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ పరంగా ముగింపు దశకి చేరుకుంది. ఇంతవరకూ ఈ సినిమా నుంచి వదిలిన టీజర్ కు .. రీసెంట్ గా రిలీజ్ చేసిన టైటిల్ సాంగ్ కు అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది.

ఈ  నేపథ్యంలో రానా పాత్ర స్వరూప స్వభావాలను ఆవిష్కరిస్తూ ఒక టీజర్ ను విడుదల చేయనున్నట్టుగా తెలుస్తోంది. వచ్చేవారంలో రానా టీజర్ ఉండొచ్చని అంటున్నారు. ఈ టీజర్ తో సినిమాపై మరింతగా అంచనాలు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. పవన్ సరసన నిత్యామీనన్ నటిస్తుండగా, రానా జోడీగా ఐశ్వర్య రాజేశ్ కనిపించనుంది. 'సంక్రాంతి' పండుగ సందర్భంగా జనవరి 12వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

More Telugu News