Andhra Pradesh: ఏపీలో మరో 1,190 మందికి కరోనా పాజిటివ్

AP Covid updates
షార్ట్స్‌లో చూడండి
ఏపీలో గడచిన 24 గంటల్లో 45,533 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,190 మందికి పాజిటివ్ అని వెల్లడైంది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 219 కొత్త కేసులు నమోదయ్యాయి. కృష్ణా జిల్లాలో 164, నెల్లూరు జిల్లాలో 139, ప్రకాశం జిల్లాలో 121 కేసులు గుర్తించారు. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 10 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

అదే సమయంలో 1,226 మంది కరోనా నుంచి కోలుకోగా, 11 మంది మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,29,985 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,00,877 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 15,110 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 13,998కి పెరిగింది.
Go Back to Shorts
Andhra Pradesh
COVID19
Updates
New Cases
Deaths

More Telugu News