ఆప్ జాతీయ కన్వీనర్ గా మరోసారి ఎన్నికైన అరవింద్ కేజ్రీవాల్

12-09-2021 Sun 16:47
  • ఆప్ సారథ్య బాధ్యతలు మళ్లీ కేజ్రీకే!
  • ఆప్ జాతీయ కార్యవర్గం ఎంపిక
  • 34 మందితో నూతన కార్యవర్గం
  • పార్టీ కార్యదర్శిగా పంకజ్ గుప్తా
Arvind Kejriwal once again elected as AAP National Convener

ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పగ్గాలు మరోసారి అరవింద్ కేజ్రీవాల్ కే దక్కాయి. కేజ్రీవాల్ ఆప్ జాతీయ కన్వీనర్ గా మరోసారి నియమితులయ్యారు. పార్టీ జాతీయ కార్యనిర్వాహక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆప్ అధినేతగా కేజ్రీవాల్ పైనే పార్టీ నేతలు విశ్వాసం ఉంచారు. ఆప్ జాతీయ కన్వీనర్ గా అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికవడం ఇది వరుసగా మూడోసారి.

ఇక పంకజ్ గుప్తా ఆప్ కార్యదర్శిగా, ఎన్డీ గుప్తా పార్టీ కోశాధికారిగా ఎన్నికయ్యారు. మొత్తం 34 మందితో ఆప్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఆప్ నూతన కార్యవర్గం ఐదేళ్ల పాటు కొనసాగుతుంది.