తెలంగాణలో మరో 296 మందికి కరోనా పాజిటివ్
- గత 24 గంటల్లో 69,833 కరోనా పరీక్షలు
- జీహెచ్ఎంసీ పరిధిలో 74 కొత్త కేసులు
- రాష్ట్రంలో ఒకరి మృతి
- ఇంకా 5,324 మందికి చికిత్స
అదే సమయంలో 322 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 6,61,302 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,52,085 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 5,324 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మరణాల సంఖ్య 3,893కి పెరిగింది.
