పాక్ కు మరణ శిక్షే.. కాబూల్ లో కదం తొక్కిన ఆఫ్ఘన్లు
- మహిళలు సహా గళమెత్తిన ప్రజలు
- మజారీ షరీఫ్ లోనూ నిరసనలు
- తాలిబన్లకు చావుతప్పదంటూ ఆగ్రహం
- ఇరాన్ పాక్ ఎంబసీ ముందు ఆందోళనలు
‘‘తాలిబన్లకు మరణ శిక్ష.. ఆఫ్ఘనిస్థాన్ జిందాబాద్’’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. పాకిస్థాన్ కూ మరణ శిక్ష తప్పదంటూ నినదించారు. తాలిబన్లకు వ్యతిరేకంగా ఆఫ్ఘన్లందరూ గళం విప్పాల్సిన సమయం వచ్చిందని అహ్మద్ మసూద్ సందేశం ఇచ్చిన కొన్ని గంటల్లోనే ఆఫ్ఘన్లు ఇలా పదం కదిపి కదం తొక్కారు.
విదేశీ అరాచక శక్తులతో తాలిబన్లు చేతులు కలిపారని, దీనిపై దేశంలోని అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ములంతా ఏకం కావాలని అహ్మద్ మసూద్ పిలుపునిచ్చారు. కాగా, ఇరాన్ రాజధాని టెహ్రాన్ లోని పాక్ రాయబార కార్యాలయం ముందు కూడా ఆఫ్ఘనిస్థాన్ ప్రజలు నిరసన ప్రదర్శన చేశారు. 'పాకిస్థాన్, తాలిబన్లకు మరణ శిక్ష' అంటూ నినదించారు.