Nandamuri Mokshagna: బావమరిదికి బర్త్ డే విషెస్ తెలిపిన నారా లోకేశ్

  • నేడు నందమూరి మోక్షజ్ఞ పుట్టినరోజు
  • అభిమానుల వేడుకలు
  • ట్విట్టర్ లో స్పందించిన లోకేశ్
  • మోక్షజ్ఞ మనసు బంగారం అని కామెంట్  
Nara Lokesh wishes his brother in law Nandamuri Mokshgna on his birthday

నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. మోక్షజ్ఞ 1994 సెప్టెంబరు 6న జన్మించారు. రాష్ట్రవ్యాప్తంగా బాలయ్య అభిమానులు మోక్షజ్ఞ పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తన బావమరిది మోక్షజ్ఞకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

మోక్షజ్ఞ మనసు బంగారం అంటూ కొనియాడారు. తన కలలు ఫలించాలని కోరుకుంటున్నానని, ఎనలేని ఆనందం, సుఖశాంతులు ప్రసాదించాలని ఆ భగవంతుడ్ని ప్రార్థిస్తున్నానని లోకేశ్ పేర్కొన్నారు. కాగా, మోక్షజ్ఞ ఇవాళ తన నివాసంలో అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో మోక్షజ్ఞ తల్లి వసుంధర కూడా పాల్గొన్నారు.

More Telugu News