Devineni Uma: పోల‌వ‌రం ప్రాజెక్టు ప‌నులు ఏ మాత్రం ముందుకు సాగ‌ట్లేదు: దేవినేని ఉమ‌

devineni slams ycp
పోల‌వ‌రం ప‌నులు ఎంత‌వ‌ర‌కు పూర్తి చేశారో ప్ర‌జ‌ల‌కు చెప్పాలని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వాన్ని టీడీపీ నేత‌ దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు డిమాండ్ చేశారు. ఈ రోజు మంగ‌ళ‌గిరిలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ... టీడీపీ హయాంలో పూర్తి చేసిన ప‌నులే ఇప్ప‌టివ‌ర‌కు ఉన్నాయని ఆయ‌న తెలిపారు. పోల‌వ‌రం ప్రాజెక్టు ప‌నులు ఏ మాత్రం ముందుకు సాగ‌ట్లేదని ఆయ‌న ఆరోపించారు.

74 శాతం నుంచి 77 శాతానికి ప‌నులు పూర్తి చేసిన‌ట్లు ప్ర‌భుత్వం చెబుతోంద‌ని, అయితే, ఎగువ కాఫ‌ర్ డ్యామ్‌, దిగువ కాఫ‌ర్ డ్యామ్ ప‌నులు అప్పుడు పూర్తి చేసిన లెక్క‌లే ఇప్ప‌టికీ ఉన్నాయని ఆయ‌న అన్నారు. క‌మీష‌న్ల‌కు ఆశ‌ప‌డ్డామ‌ని త‌మ‌పై అప్ప‌ట్లో వైసీపీ నేత‌లు త‌ప్పుడు ప్ర‌చారం చేశార‌ని దేవినేని మండిప‌డ్డారు.
Devineni Uma
Telugudesam
Andhra Pradesh

More Telugu News