Akash Puri: థియేటర్లకే రానున్న 'రొమాంటిక్'

  • ఆకాశ్ పూరి హీరోగా 'రొమాంటిక్'
  • కథానాయికగా కేతిక శర్మ పరిచయం 
  • సెన్సార్ కార్యక్రమాలు పూర్తి 
  • త్వరలోనే థియేటర్లలో విడుదల   
Romantic movie update

పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరి హీరోగా 'రొమాంటిక్' అనే సినిమా రూపొందింది. సొంత బ్యానర్ పై పూరి నిర్మించిన ఈ సినిమాకి, అనిల్ పాదూరి దర్శకుడిగా వ్యవహరించాడు. ఈ సినిమా చిత్రీకరణ చాలా రోజుల క్రితమే పూర్తయింది. అయితే సరైన విడుదల తేదీ కోసం ఎదురుచూస్తున్నారు.

తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. ఈ సినిమా యు/ఎ సర్టిఫికెట్ ను సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని అధికారికంగా తెలియపరుస్తూ అధికారిక పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో ఆకాశ్ పూరి జోడీగా కేతిక శర్మ అలరించనుంది. తెలుగులో ఈ అమ్మాయికి ఇదే మొదటి సినిమా.

ఈ సినిమా ఓటీటీకి వెళుతుందా? థియేటర్లకు వస్తుందా? అనే విషయంలో కొన్ని రోజులుగా ఆసక్తి నెలకొంది. దీనిపై వివరణనిస్తూ, ఈ సినిమాను సాధ్యమైనంత త్వరలోనే థియేటర్లలో విడుదల చేయనున్నట్టుగా మేకర్స్ చెప్పారు. మొత్తానికి ఈ సినిమా థియేటర్లలోనే యూత్ విజిల్స్ మధ్య సందడి చేయనుందన్న మాట.

More Telugu News