Amit Shah: చానును సన్మానించిన అమిత్​ షా

Amit Shah Felicitates Olympics Silver Medalist Meerabai Chanu
  • ఏఎస్పీగా నియమించిన మణిపూర్ ప్రభుత్వం
  • బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ 51వ వార్షికోత్సవంలో సత్కారం
  • టోక్యో ఒలింపిక్స్ లో రజతం గెలిచిన వెయిట్ లిఫ్టర్
ఒలింపిక్స్ లో రజత పతకం సాధించిన వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చానును కేంద్ర హోం మంత్రి అమిత్ షా సన్మానించారు. ఇవాళ ఢిల్లీలో జరిగిన బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ 51వ వార్షికోత్సవం సందర్భంగా ఆమెకు ఈ సన్మానం చేశారు. కాగా, మణిపూర్ ప్రభుత్వం ఆమెను అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఏఎస్పీ)గా నియమిస్తూ ఉత్తర్వులిచ్చింది.

టోక్యో ఒలింపిక్స్ లో భారత్ కు తొలి పతకాన్ని చానునే అందించిన విషయం తెలిసిందే. నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన ఆమె ఒలింపిక్స్ సాధన కోసం ఎన్నో కష్టాలు పడింది. ఎంతో దూరంలో ఉన్న అకాడమీకి వెళ్లి ప్రాక్టీస్ చేసేందుకు రోజూ ట్రక్ డ్రైవర్లను లిఫ్ట్ అడిగి వెళ్లేది. దీంతో ఒలింపిక్స్ లో రజతం గెలిచాక ఆ ట్రక్ డ్రైవర్లందరికీ ఆమె ఆత్మీయ సన్మానం చేసిన సంగతి తెలిసిందే.
Amit Shah
Meerabai Chanu
Olympics
Tokyo Olympics

More Telugu News