Ratan Tata: అది ఫేక్ న్యూస్: రతన్ టాటా వివరణ

That is fake news says Ratan Tata
  • సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న ఫేక్ వార్తలు
  • తాజాగా రతన్ టాటా పేరిట న్యూస్ వైరల్
  • తాను ఆ మాట చెప్పలేదన్న రతన్ టాటా
సోషల్ మీడియాలో వచ్చే వార్తల్లో ఏది నిజమో? ఏది అబద్ధమో? అర్థం కాని పరిస్థితి నెలకొంది. ప్రముఖుల పేర్లతో ఫేక్ వార్తలు పెద్ద ఎత్తున చలామణి అవుతున్నాయి. తాజాగా ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా పేరుతో ఓ ఫేక్ న్యూస్ వైరల్ అవుతోంది.

'ఆధార్ కార్డు ఆధారంగా మద్యం అమ్మకాలు చేపట్టాలి. మద్యం కొనేవారికి ప్రభుత్వ సబ్సిడీలు అందించకూడదు. ఆల్కహాల్ కొనేవారు ఆహారాన్ని కూడా కొనుక్కోగలరు. మనం వారికి ఉచితంగా ఆహారాన్ని ఇస్తే... వారు మద్యం కొనుగోలు చేస్తున్నారు' అని రతన్ టాటా చెప్పినట్టు సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతోంది. ఈ వార్తలపై రతన్ టాటా స్పందించారు. ఈ మాటలు తానెప్పుడూ చెప్పలేదని, ఇది ఫేక్ న్యూస్ అని ఆయన వివరణ ఇచ్చారు. 
Ratan Tata
Social Media
Fake News

More Telugu News