దళితబంధును ప్రజలు నమ్మే ప్రసక్తే లేదు: డీకే అరుణ

03-09-2021 Fri 17:01
  • హుజూరాబాద్ ఉపఎన్నిక కోసమే దళితబంధును తీసుకొచ్చారు
  • కులాల పేరుతో ప్రజలను విభజించి లాభం పొందాలనుకుంటున్నారు
  • వికారాబాద్ జిల్లా ప్రజలను కేసీఆర్ ముంచేశారు
No one believing Dalita Bandhu says DK Aruna
టీఆర్ఎస్ ప్రభుత్వం దళితబంధు పథకాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈ పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారు. మరోవైపు ఈ పథకంపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విమర్శలు గుప్పించారు. కేవలం హుజూరాబాద్ ఉపఎన్నిక కోసమే ఈ పథకాన్ని తీసుకొచ్చారనే విషయం ప్రజలందరికీ అర్థమయిందని... ఆ పథకాన్ని ఎవరూ నమ్మరని చెప్పారు.

వికారాబాద్ జిల్లా ప్రజలను సీఎం కేసీఆర్ నిండా ముంచేశారని మండిపడ్డారు. ప్రాజెక్టుల పేరుతో వేల కోట్ల రూపాయలను వెనకేసుకున్నారని... ఆ డబ్బును ఎన్నికల్లో వెదజల్లుతున్నారని ఆరోపించారు. కులాల పేరుతో ప్రజలను విభజించి లాభం పొందాలని కేసీఆర్ యత్నిస్తున్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్నారని తెలిపారు.