Prakash Raj: 'మా' ఎన్నికల్లో తన ప్యానెల్ సభ్యులను ప్రకటించిన ప్రకాశ్ రాజ్ 

Prakash Raj reveals his panel members for MAA elections
  • రసవత్తరంగా మా ఎన్నికలు
  • మీడియాకు వివరాలు తెలిపిన ప్రకాశ్ రాజ్
  • ఉపాధ్యక్షులుగా హేమ, బెనర్జీ
  • ట్రెజరర్ గా నాగినీడు
  • జయసుధకు దక్కని స్థానం
  • ఆమె అమెరికా వెళ్లిందన్న ప్రకాశ్ రాజ్
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో పోటీ చేసే తన కార్యవర్గాన్ని ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ ఇవాళ ప్రకటించారు. ప్రకాశ్ రాజ్ 'మా' అధ్యక్ష పదవికి పోటీపడుతున్న సంగతి తెలిసిందే. ప్రకాశ్ రాజ్ ప్యానెల్ లో ఉపాధ్యక్షులుగా శ్రీకాంత్, బెనర్జీ, హేమ పోటీ చేస్తారని ప్రకాశ్ రాజ్ వెల్లడించారు. ప్రధాన కార్యదర్శిగా జీవిత రాజశేఖర్, ట్రెజరర్ గా నాగినీడు, సంయుక్త కార్యదర్శులుగా అనితా చౌదరి, ఉత్తేజ్ పోటీ చేయనున్నట్టు తెలిపారు.

సీనియర్ నటి జయసుధ అమెరికా వెళ్లడం వల్ల ఆమెకు ప్యానెల్లో చోటు కల్పించలేదని ప్రకాశ్ రాజ్ వెల్లడించారు. అయితే ప్యానెల్ కు తన మద్దతు ఉంటుందని జయసుధ హామీ ఇచ్చారని వివరించారు.

ప్రకాశ్ రాజ్ ప్యానెల్లో ప్రగతి, అనసూయ, అజయ్, సుబ్బరాజు, సమీర్, ఖయ్యూం, బ్రహ్మాజీ, కౌశిక్, ప్రభాకర్, భూపాల్, శివారెడ్డి, రమణారెడ్డి, సుడిగాలి సుధీర్, సురేశ్ కొండేటి, తనీష్, టార్జాన్  సభ్యులుగా ఉన్నారు.
Prakash Raj
MAA Elections
Panel
Members
Tollywood

More Telugu News