Karthikeya: వరుణ్ తేజ్ చేతుల మీదుగా 'రాజా విక్రమార్క' టీజర్!
- కార్తికేయ నుంచి యాక్షన్ ఎంటర్టైనర్
- 'రాజా విక్రమార్క' టైటిల్ ఖరారు
- కథానాయికగా తాన్య హోప్
- దర్శకుడిగా శ్రీ సరిపల్లి పరిచయం
కార్తికేయ యువ కథానాయకులకు గట్టి పోటీ ఇవ్వడానికి తనవంతు కృషి చేస్తున్నాడు. విభిన్నమైన కథలు .. వైవిధ్యభరితమైన పాత్రలను ఎంచుకుంటూ ముందుకు వెళుతున్నాడు. ఆ మధ్య 'చావు కబురు చల్లగా ' చేసిన ఆయన, ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నాడు. ఆయన తాజా చిత్రంగా 'రాజావిక్రమార్క' సినిమా రూపొందింది. షూటింగు పార్టును పూర్తి చేసుకున్న ఈ సినిమా, పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.
రామారెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకి శ్రీ సరిపల్లి దర్శకత్వం వహించాడు. రేపు ఉదయం 10:35 నిమిషాలకు వరుణ్ చేతుల మీదుగా టీజర్ ను రిలీజ్ చేయిస్తున్నారు. కార్తికేయ సరసన కథానాయికగా తాన్య హోప్ అలరించనుంది. చిరంజీవి అభిమానినైన తాను చిరంజీవి టైటిల్ తో ఉన్న సినిమా చేస్తానని ఎప్పుడూ అనుకోలేదని కార్తికేయ చెబుతుండటం విశేషం.