ఈ నెల 6న 'క్లాప్' టీజర్ రిలీజ్!

Clap movie teaser will release soon
  • ఆది పినిశెట్టి నుంచి 'క్లాప్' మూవీ 
  • దర్శకుడిగా పృథ్వీ ఆదిత్య పరిచయం 
  • ఇళయరాజా సంగీతం ప్రత్యేక ఆకర్షణ 
  • కీలక పాత్రల్లో నాజర్ .. ప్రకాశ్ రాజ్ 
మొదటి నుంచి కూడా ఆది పినిశెట్టి విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలను చేస్తూ వస్తున్నాడు. ఒక వైపున హీరోగా సినిమాలు చేస్తూనే, వైవిధ్యంగా అనిపిస్తే విలన్ పాత్రలు కూడా చేస్తూ వెళుతున్నాడు. అందువలన తెలుగు .. తమిళ భాషల్లో ఆయనకి మంచి గుర్తింపు ఉంది. తాజాగా తెలుగులో ఆయన 'క్లాప్' అనే సినిమా చేస్తున్నాడు. క్రీడా నేపథ్యంలోనే ఈ కథ నడుస్తుంది. బిగ్ ప్రింట్ పిక్చర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి, పృథ్వీ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నాడు.

ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి టీజర్ ను వదలడానికి మేకర్స్ ఒక ముహూర్తాన్ని ఫిక్స్ చేశారు. ఈ నెల 6వ తేదీన టీజర్ ను రిలీజ్ చేయనున్నట్టు చెబుతూ, అధికారిక పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఆది పినిశెట్టి సరసన ఆకాంక్ష సింగ్ - కృష్ణ కురూప్ నటిస్తున్నారు. కీలకమైన పాత్రల్లో నాజర్ .. ప్రకాశ్ రాజ్ కనిపించనున్నారు. ఇళయరాజా సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. ఈ సినిమాతో ఆది పినిశెట్టి పుంజుకుంటాడేమో చూడాలి.
Go Back to Shorts
Adi Pinishetty
Akanksha Singh
Krisha Kurup

More Telugu News