ఈడీ ముందు అప్రూవర్ గా మారి.. టాలీవుడ్ స్టార్ల చిట్టా విప్పిన కెల్విన్?
- ఆరు నెలల క్రితం డ్రగ్ పెడ్లర్ కెల్విన్ పై ఈడీ కేసు
- 12 సార్లు విచారించిన ఈడీ అధికారులు
- విదేశాలకు భారీగా డబ్బు బదిలీ అయినట్టు గుర్తించిన ఈడీ
అప్పటి నుంచి దాదాపు 12 సార్లు కెల్విన్ ను ఈడీ అధికారులు ప్రశ్నించారు. కెల్విన్ అకౌంట్లను కూడా ఈడీ ఫ్రీజ్ చేసింది. ఈ క్రమంలో ఈడీకి కెల్విన్ అప్రూవర్ గా మారాడు. కెల్విన్ అందించిన వివరాల ఆధారంగానే తాజాగా 12 మంది సినీ ప్రముఖులకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఇక్కడి నుంచి విదేశాలకు డబ్బును భారీగా బదిలీ చేసినట్లు ఈడీ గుర్తించింది. దర్శకుడు పూరీ జగన్నాథ్ ను విచారించిన సమయంలో కూడా నగదు బదిలీ అంశంపైనే ఈడీ ఎక్కువగా ప్రశ్నించినట్టు తెలుస్తోంది.